ములుగు మండలంలోని కాసిందిపేట గ్రామంలో విద్యాదాఘాతానికి గురై 17 గేదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన పశువుల కాపారి 17 బర్రెలు వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లాడు. పొలంలో పడి ఉన్న 11కేవీ కరెంట్ లైన్‌కు తాకి మృత్యువాతపడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ మూడు బర్రెలకు వెటర్నరీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పదిహేడు మూగ జీవుల మృతితో పశువుల కాపారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
సుమారు రూ.15 లక్షల నష్టం వాటినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. నష్ట పరిహారం ఇప్పిస్తామని విద్యుత్ అధికారులు పశువుల కాపరికి హామీ ఇచ్చారు.