ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో దారుణం చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగిమ్మని అడిగేందుకు వెళ్తే... అప్పిచ్చిన వ్యక్తితో పాటు అతని వెంట వచ్చిన అతనిపై కూడా కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నాడు. చంపేందుకు పథకం పన్ని మరీనిందితులు వారిపైదాడి చేశారు.గ్రామంలోని బెంగుళూరు బేకరీ యజమాని దయానంద్, అతని సోదరుడు కలిసి దేవేందర్‌రెడ్డి వద్ద రూ.8 లక్షలు అప్పు తీసుకున్నారు.
అప్పు తిరిగిమ్మని అడిగినందుకు కత్తులతో దాడి.. ఒకరు మృతి - MURDERED NEWS IN TELANGANA
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని అడిగేందుకు వెళ్లిన పాపానికి ఓ సీనియర్ ఫొటో జర్నలిస్టును అతి దారుణంగా నరికి చంపారు. ఈ దారుణం ములుగు జిల్లా పస్రాలో చోటుచేసుకుంది.
![అప్పు తిరిగిమ్మని అడిగినందుకు కత్తులతో దాడి.. ఒకరు మృతి BORROWERS BRUTALLY MURDERED LENDERS IN PASRA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6275232-thumbnail-3x2-pppp.jpg)
BORROWERS BRUTALLY MURDERED LENDERS IN PASRA
ఎన్ని రోజులైనా.. డబ్బులు తిరిగి చెల్లించకపోవటం వల్ల దేవేందర్‌రెడ్డి తన మిత్రుడైన ఫొటో జర్నలిస్టు సునీల్‌రెడ్డితో కలిసి అప్పు వసూలుకు వెళ్లారు. బేకరీ వెనుక గదిలో కూర్చొని మాట్లాడుతున్న క్రమంలో దేవేందర్‌రెడ్డి, సునీల్రెడ్డిలపైన దయానంద్, అతని సోదరుడు పథకం ప్రకారం కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో దేవేందర్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా... సునీల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దేవేందర్‌రెడ్డిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అప్పు తిరిగిమ్మని అడిగినందుకు కత్తులతో దాడి... ఒకరు మృతి