ములుగు జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని డీఎల్ఆర్ ఫంక్షన్హాల్లో రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. వెంకటాపూర్, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయికి చెందిన 150 మంది యువకులు, పోలీసులతో పాటు పోలీసు అధికారులు కూడా రక్తదానం చేశారు.
ములుగు జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం - ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య
పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ములుగు జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ప్రారంభించారు.
ములుగు జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం
రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ బ్లెడ్ డొనేషన్ సర్టిఫికెట్తో పాటు పండ్లరసం, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయి చైతన్య, సీఐ దేవేందర్ రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.