ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న మేడారం మహా జాతరకు భక్తులు ఇప్పటి నుంచే తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేళ్లం బాలరాజు కుటుంబ సమేతంగా గురువారం వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
మేడారం జాతరకు బైలెల్లుతున్న భక్తజనం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేళ్లం బాలరాజు
మేడారం జాతరకు గురువారం భక్తజనం పోటెత్తారు. ఏపీ పోలవరం నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేళ్లం బాలరాజు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా జాతరకు చేరుకొని జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.
మేడారం జాతరకు బైలెల్లుతున్న భక్తజనం
ఎన్నికల ముందు వచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే అమ్మవార్లకు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కలు పెడతానని ముక్కుకున్నానని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆ మొక్కు అప్పచెప్పామని అన్నారు. వచ్చే ఫిబ్రవరి మాసంలో జరగబోయే మేడారం మహా జాతరకు తెలుగు రాష్ట్ర భక్తులందరికీ తల్లి ఆశీస్సులు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఘోర రోడ్డు ప్రమాదం... 250గొర్రెలు మృతి