తెలంగాణ

telangana

ETV Bharat / state

'పీఆర్సీని వెంటనే అమలు చేయాలి... లేకుంటే నిరసనలు తప్పవు' - భాజపా నాయకుల ధర్నా

పీఆర్సీని వెంటనే అమలు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలతో భాజపా నేతలు ర్యాలీ నిర్వహించి... ములుగు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. రెండేళ్లు సమయం తీసుకున్నా.. ఇంతవరకు పీఆర్సీ అమలుపరచకపోవడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నించారు.

bjp-leaders-and-government-school-teachers-protest-on-prc-in-mulugu-district
'పీఆర్సీని వెంటనే అమలు చేయాలి... లేకుంటే నిరసనలు తప్పవు'

By

Published : Dec 14, 2020, 2:27 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో భాజపా ర్యాలీ నిర్వహించింది. పీఆర్సీని వెంటనే అమలు చేయాలంటూ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి... ఇప్పటివరకు పీఆర్సీ అమలు చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకపోవడం సబబు కాదని... వెంటనే దానిని అమలు చేయాలని లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:'పీఆర్సీ, ఐఆర్ ఇవ్వలేని పరిస్థితిలో తెరాస ప్రభుత్వం ఉంది'

ABOUT THE AUTHOR

...view details