తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరేళ్లుగా అర్ధాకలితో అలమటిస్తున్నాం' - మంత్రి కేటీఆర్

పెండింగ్​లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ ములుగు జిల్లాలోని ఓ బిల్ట్ కర్మాగారం కార్మికుడు.. ఫ్యాక్టరీ భవనం పైకెక్కి ఆందోళన చేశాడు. సమస్యలను పరిష్కరించకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

bilt worker  Protested in mulugu Demanding to solve their problems
'ఆరేళ్లుగా అర్ధాకలితో అలమటిస్తున్నాం'

By

Published : Mar 12, 2021, 7:08 PM IST

బిల్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ.. ఓ కార్మికుడు ఫ్యాక్టరీ భవనం పైకెక్కి నిరసన వ్యక్తం చేశాడు. వేతనాలు విడుదల చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడుతానని బెదిరించాడు. అనంతరం.. పోలీసులు, తెరాస నాయకుల హామీతో భవనం దిగిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో జరిగింది.

తెరాస నాయకులు.. విషయాన్ని మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లి చర్చలు జరిపిస్తామని హామీ ఇచ్చారు. కమలాపురంలోని బిల్ట్ కర్మాగారం 2014 లో పలు కారణాల వల్ల మూతపడింది. 6 సంవత్సరాలుగా వేతనాలు లేక తాము అర్ధాకలితో అలమటిస్తున్నామని లింగంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులతో తెరాసది పేగుబంధం: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details