ములుగు జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ కుసుమ జగదీష్ పుట్టిన రోజు సందర్భంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వికాస తరంగిణీ సంయుక్తంగా మహిళా వికాస్ అవగాహన - చికిత్స శిబిరం నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పనిచేస్తున్న మహిళలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలనే ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కుసుమ తెలిపారు. తమ సంస్థ ద్వారా 1000కి పైగా మహిళా ఆరోగ్య శిబిరాలు నిర్వహించామన్నారు. శరీరంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలంలో బయటపడతాయని.. అందుకే ఆరోగ్యంపై అశ్రద్ధ వహించరాదని త్రిదండి దేవానంద జీయర్‌స్వామి తెలిపారు.
ములుగులో మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం - ZP chairperson
మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదంటూ ములుగు జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ కుసుమ తన జన్మదినం సందర్భంగా మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు.
ములుగులో మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం