ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి, ఆదివారం సెలవుదినం కావడం వల్ల సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తజనం పోటెత్తారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క సారలమ్మల జాతర జరుగుతుంది.
జాతర ముగిసినా మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారంలో జాతరకు ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి, ఆదివారం సెలవుదినం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా జరుగుతుందని ప్రధాన పూజారి పేర్కొన్నారు.
జాతర ముగిసినా మేడారానికి పోటెత్తిన భక్తులు
మాఘశుద్ధ పౌర్ణమి బుధ, గురు వారాలలో వస్తే పూజారులు ఘనంగా జాతర నిర్వహిస్తారని ప్రధాన పూజారి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. లేదంటే శని, ఆది వారాలు వస్తే మాఘ శుద్ధ పౌర్ణమి ముందు బుధ, గురు రోజుల్లో జాతర నిర్వహిస్తారని తెలిపారు. ఇది ఆచారంగా వస్తోందని అన్నారు.
ఇదీ చూడండి :తేనెటీగల దాడిలో దివ్యాంగుడు మృతి