ఆదివాసీ గిరిజనులను చైతన్య వంతులుగా మార్చెేందుకు క్రీడలు ఉపయోగపడతాయని ములుగు జిల్లా ఏఎస్పీ సాయి చైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గిరిజన క్రీడలను నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ డాక్టర్ ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు.
ములుగులో గిరిజన క్రీడలు ప్రారంభం - ములుగు జిల్లా ఏఎస్పీ చైతన్య తాజావార్తలు
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గిరిజన క్రీడలు జరుగుతున్నాయి. నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ డ్రాక్టర్ ఆనంద్, ములుగు ఏఎస్పీ సాయి చైతన్య ఈ క్రీడలను ప్రారంభించారు.
ములుగులో గిరిజన క్రీడలు ప్రారంభం
క్రీడల్లో పాల్గొనేందుకు యువకులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో మండల స్థాయి క్రీడలు జరుగుతున్నాయన్నారు. ఇందులో గెలుపొందిన టీములు జిల్లాస్థాయి మేడారం ట్రోఫీలో ఆడతాయని తెలిపారు. ఇలాంటి క్రీడలు శరీరక, మానసిక ఉల్లాసం కల్గిస్తాయని ఆనంద్ అన్నారు.
ఇదీ చదవండి:వ్యాక్సిన్ వస్తోంది కదా అని నిర్లక్ష్యం తగదు: లలితాదేవి