ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతల మినీ జాతర నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. గుడి పరిసరాలు, చిలకలగుట్ట, జంపన్న వాగు, రెడ్డిగూడెంతో పాటు రహదారి వెంబడి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. చెత్తను తొలగించేందుకు ఏపీ నుంచి అదనంగా 200 మందిని రప్పించినట్లు అధికారులు తెలిపారు.
అసౌకర్యాలు లేకుండా..
ఇప్పటికే భక్తులు ఆదివారం, బుధవారం, గురువారాల్లో వనదేవతల దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారని వెల్లడించారు. చిన్న జాతర సమయానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తెలిపారు.