కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతీకైన రామప్ప దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఇవాశ సాయంత్రం జరిగే భవాని రామలింగేశ్వర స్వామి కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
శివపార్వతుల కల్యాణానికి రామప్ప సిద్ధం - maha shivaratri arrangements in ramappa temple
భవాని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. నేటి రాత్రి స్వామివారి కల్యాణం సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

స్వామి కల్యాణానికి ముస్తాబైన రామప్ప ఆలయం
భద్రత పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో సమారు 120 మంది పోలీసులు ఆలయ పరిసరాల్లో మోహరించారు. ఆలయానికి 300 మీటర్ల దూరంలోనే తాత్కాలిక చెక్ పోస్ట్ ఏర్పాటుచేసి.. రాకపోకలను క్రమబద్దీకరిస్తున్నారు.
స్వామి కల్యాణానికి ముస్తాబైన రామప్ప ఆలయం
ఇవీచూడండి:దేశమంతా 'హరహర మహాదేవ శంభోశంకర'