తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీ తుడుందెబ్బ వ్యవస్థాపకుడు నర్సింగరావు కన్నుమూత

ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దబ్బకట్ల నర్సింగరావు ప్రాణాలు విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తెలుగు రాష్ట్రాలలోని ఆదివాసీ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Adivasi Thudumdebba founder Dabbakatla Narsingarao died in mulugu district
ఆదివాసీ తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దబ్బకట్ల నర్సింగరావు కన్నుమూత

By

Published : Aug 25, 2020, 9:23 PM IST

ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దబ్బకట్ల నర్సింగరావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మరణం పట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ నాయకులు దిగ్భ్రాంతి చెందారు. 1995లో ఎంపీటీసీ ఎన్నికల్లో కొత్తూరు గ్రామం నుంచి ఎంపీటీసీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొంది ములుగు ఎంపీపీ పదవిని స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఉన్న ఆదివాసీ ఎంపీపీలతో సమత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజన అభ్యుదయ సంఘం పేరుతో దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద ఆదివాసీ హక్కులపై భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

1996 ఆగస్టు 6న ఆదివాసీ సంఘాలను కలుపుకొని ఏటూరునాగారంలో ఆదివాసీ తుడుందెబ్బ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉద్యమాన్ని విస్తరించి ఆదివాసీ ప్రాంతంలో స్వయం పాలన డిమాండ్​తో ముందుకు వెళ్లారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఎన్నో ఎకరాల భూములను గిరిజనేతర భూస్వాముల వద్ద నుంచి తీసుకుని ఆదివాసులకు పంచిపెట్టాడు. 1998లో వేల ఎకరాల భూములు ఉన్న భూస్వాములపై పోరాటం చేసిన కారం పార్వతి హత్యకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇంతటి మహోన్నత వ్యక్తి మృతిచెందడం పట్ల ఆదివాసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: 'తీసుకున్న భూమిని వినియోగించకుంటే చర్యలు తప్పవు'

ABOUT THE AUTHOR

...view details