వర్షం కారణంగా పొలంలో పెరిగిన కలుపు తొలగించేందుకు మనుషులే కాడెడ్లలా మారారు. గంట పాటు శ్రమించి నాగలి లాగుతూ కలుపు తొలగించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు మోట్లగూడెంలో ఈ సంఘటన జరిగింది.
పంటను రక్షించుకోవడం కోసం కాడెడ్లైన దంపతులు - ములుగు జిల్లా వార్తలు
దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి నానాటి దిగజారుతోంది. అన్నదాతల మెడపై అప్పుల కత్తి వేళాడుతోంది. వారు ఆర్థికంగా బలహీనమైపోతున్నారు. ఎడ్లు కొనేందుకు డబ్బులు లేక ఓ రైతు దంపతులు తామే కాడెడ్లయ్యారు. పంట చేనును దున్నారు ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు మోట్లగూడెనికి చెందిన లొల్లి శంకర్, లక్ష్మి.
![పంటను రక్షించుకోవడం కోసం కాడెడ్లైన దంపతులు A farmer couple turned into oxen for his crop in mulugu district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8891252-thumbnail-3x2-fermer.jpg)
పంటను రక్షించుకోవడం కోసం కాడెడ్లైన దంపతులు
గ్రామానికి చెందిన లొల్లి శంకర్ అనే రైతు పత్తి సాగు చేస్తున్నాడు. వర్షం కారణంగా... పెరిగిన కలుపు తొలగించడానికి ఎడ్లు అరువు అడిగారు. ఎవరూ సమయానికి స్పందిచకపోవడం వల్ల భార్యతో కలిసి నాగలి చేత పట్టి తొలగించారు. గంటపాటు నాగలి లాగి అర ఎకరం కలుపు తీసినట్టు తెలిపారు.
ఇదీ చదవండి:గాంధీలో ఆందోళనకు దిగిన ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది