తెలంగాణ

telangana

భారీ వర్షాలతో తెగిన కల్వర్టు.. ఆగిపోయిన రాకపోకలు

By

Published : Sep 14, 2020, 10:21 PM IST

ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల కల్వర్టు తెగిపోయింది. దీనితో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.

A culvert broke  by heavy rains in mulugu disrtrict
భారీ వర్షాలతో తెగిన కల్వర్టు.. ఆగిపోయిన రాకపోకలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని భారీ వర్షం కురవడం వల్ల తాడ్వాయి నుంచి బీరెల్లి గంగారాం వరకు 24 కోట్లతో డబుల్​ రోడ్ల నిర్మాణం చేపట్టారు.

అంకంపల్లి గ్రామ సమీపంలోని కల్వర్టు రాత్రి కురిసిన వర్షానికి తెగిపోయింది. కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పైభాగంలో ఉన్న గుంట మత్తడి తెగిపోవడం వల్ల కల్వర్టు పూర్తి స్థాయిలో వరద నీటికి కొట్టుకుపోయింది. దీనితో రాకపోకలు ఆగిపోయాయి.

కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో అందులో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన వ్యక్తిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

ఇదీ చదవండి:సీఎం కాన్ఫరెన్స్​కు ఆహ్వానించారు.. అంతలోనే రావద్దన్నారు!

ABOUT THE AUTHOR

...view details