అమాయకపు చూపులతో కుటుంబ పోషణ కోసం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఏదో ఒక పని చేసుకొనైనా పొట్ట నింపుకోవాలనుకునేవారు అనేకమంది కనిపిస్తారు. వన దేవతలున్న ఈ జాతరలో ఓ చిన్న పిల్లాడికి గాంధీ వేషధారణ వేసి దారిలో నిల్చొబెట్టింది తన తల్లి. అటువైపు వచ్చే వారు దయతలచి ఎంతోకొంత నగదు దానం చేస్తారనే ఉద్దేశ్యంతో ఆమె అలా చేసింది.
చిన్నోడితో సెల్ఫీలు:
తెలిసి తెలియని వయస్సుతో అమాయకంగా చూస్తున్న ఆ చిన్నోడితో భక్తులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. వారికి తోచినది ఆ బాబు చేతిలో పెట్టి వెళ్లిపోతున్నారు. అయితే ఇవేవి తనకు పట్టనట్టు దగ్గరున్న బొమ్మ ఫోన్‌తో ఆడుకోవడంలో ఆ పిల్లాడు నిమగ్నమయ్యాడు. తన కుమారుడితో అలా చేయించడం తప్పని తెలిసినా.. కుటుంబ పోషణ కోసం తప్పడం లేదని అతని తల్లి చెప్తోంది.
ఇవీ చూడండి:సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ