ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద జంపన్నవాగులో గల్లంతైన పల్లపు తరుణ్(14) అనే బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మహేందర్, యాదలక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.
జంపన్నవాగులో గల్లంతైన బాలుడు మృతి - ములుగు జిల్లా తాజా వార్తలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు జంపన్నవాగులో గల్లంతైన బాలుడు మృతి చెందాడు. వాగు అవతలివైపు ఉన్న కొత్తూరుకు వెళ్లి వస్తుండగా వరదప్రవాహంలో గల్లంతయ్యాడు.
జంపన్నవాగులో గల్లంతైన బాలుడి మృతి
కుమారుడు తరుణ్ బంధువుల పిల్లలతో కలిసి వాగు అవతలివైపు ఉన్న కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటుతుండగా గల్లంతయ్యాడు. మరో బాలుడు సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినా ఎలాంటి ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.