ATTACK ON LADIES: గంజాయి మత్తులో మహిళలపై కొంతమంది యువకులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అకారణంగా రాళ్లు, కర్రలతో వారిపై దాటి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురు గాయపడ్డారు. మహిళలు ఆలయానికి వెళ్లి వస్తుండగా తుకారం గేట్‌లోని మరాఠా బస్తీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
మరాఠా బస్తీ వద్ద ఉన్న అమ్మవారి దేవాలయం నుంచి తిరిగి వస్తున్న సమయంలో రహదారికి అడ్డుగా ఉన్న యువకులను జరగమని చెప్పడంతో ఘర్షణ మొదలైనట్లు బాధిత మహిళలు పేర్కొన్నారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు ఒక్కసారిగా మహిళలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా వారిపై కర్రలతో దాడికి పాల్పడడం దారుణమని స్థానిక మహిళలు అగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కొంతమంది యువకులు మైనర్లను పీఎస్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.