తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ కొడుకునని చెప్పి.. లక్షలు గుంజుదామని చూశాడు! - యువకుడి మోసం

పరీక్షా కేంద్రం దగ్గర పరిచయమైన ఓ గృహిణిని తాను ఎమ్మెల్సీ కొడుకునని పరిచయం చేసుకున్నాడు. క్రమంగా ఆమెతో స్నేహం చేశాడు. స్నేహంలో చనువు పెరిగింది. ఇద్దరూ కలిసి తిరిగారు. దాన్ని అలుసుగా తీసుకొని డబ్బులు గుంజుదామని చూశాడు. తీరా.. పోలీసులు ఎంట్రీతో కటకటాల పాలయ్యాడు.

Young Man Fraud Housewife And Arrested By Police
ఎమ్మెల్సీ కొడుకునని చెప్పి.. లక్షలు గుంజుదామని చూశాడు!

By

Published : May 23, 2020, 11:54 PM IST

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​ పురపాలక సంఘం పరిధిలోని కొండాపూర్​కు చెందిన గృహిణిని పోచంపల్లికి చెందిన నోముల భరత్​ కుమార్​ అనే యువకుడు ఏప్రిల్​లో ఓ పరీక్షా కేంద్రం వద్ద పరిచయం చేసుకున్నాడు. తాను ఎమ్మెల్సీ కొడుకునని చెప్పి పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహం పెరిగి.. ఇద్దరి మధ్య చనువుకు దారి తీసింది.

ఆ చనువులో ఇద్దరూ కలిసి తిరిగారు. భరత్​ ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఇదే అదునుగా భావించిన భరత్​ ఆమె దగ్గర డబ్బులు గుంజుదామని చూశాడు. లేదంటే.. ఇద్దరూ చనువుగా ఉన్న వీడియోలు వైరల్​ చేస్తానని బెదిరించాడు. భయపడ్డ ఆమె ఘట్​కేసర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి భరత్​ను అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్​కు పంపినట్లు సీఐ రఘువీర్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details