తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్​ ద్వారా ప్రపంచ యోగా దినోత్సవం - మేడ్చల్​ మేడిపల్లి సహజ యోగ ధ్యాన కేంద్రం

ఈ ఏడాది ఆన్​లైన్​ ద్వారా ప్రపంచయోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మేడ్చల్​ జిల్లా మేడిపల్లి లోని సహజ యోగా ధ్యాన కేంద్రం కో ఆర్డినేటర్​ మల్లారెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా యోగా ధ్యాన కేంద్రాల ద్వారా సోషల్​ మీడియా ద్వారా ప్రత్యేకంగా ప్రసారాలు చేయనున్నట్లు వెల్లడించారు.

Sahaja Yoga
Sahaja Yoga

By

Published : Jun 20, 2020, 9:16 PM IST

మేడ్చల్ జిల్లా మేడిపల్లి లోని సహజ యోగ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఆన్ లైన్ ద్వారా ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు యోగ కేంద్ర కో ఆర్డినేటర్​ మల్లారెడ్డి తెలిపారు. లాక్​డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుంచి మే 5 వ తేదీ వరకు ఆన్​లైన్ మెడిటేషన్ యాక్టివిటీస్​నీ ప్రణాళిక ద్వారా నిర్వహించామన్నారు.

ఇప్పుడు సైతం అలాగే ప్రపంచవ్యాప్తంగా 300పైగా యోగా ధ్యాన కేంద్రాల ద్వారా ఫేస్ బుక్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ప్రసారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిదని మల్లారెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details