మేడ్చల్ జిల్లా ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలో.. విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. బాల్కానీలో చీర ఆరేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
నాగిరెడ్డి కాలనీలోని ఫార్చ్యూన్ హైట్స్ అపార్ట్మెంట్లో.. నేపాల్‌కు చెందిన జానకి (29) పనిమనిషిగా చేస్తోంది. రెండో అంతస్థులో ఉన్న ఓ ఫ్లాట్లో.. బాల్కానీలో బట్టలు ఆరేసే క్రమంలో.. చీర అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ట్రాన్స్ ఫారంపై పడింది. షాక్‌కు గురైన మహిళ.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.