రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తనను బెదిరిస్తున్నారని పి.శ్యామల దేవి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. సురారంలో మంత్రికి చెందిన రెండు కళాశాలల మధ్యలో ఉన్న ఒక ఎకరం 33గుంటల తన భూమిని మంత్రి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధిత మహిళ కమిషన్కు వివరించింది. ఈ సంఘటన పై స్థానిక పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు మంత్రికి మద్దతు ఇస్తూ... తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు రక్షణ కల్పించాలని పి.శ్యామల దేవి కమిషన్ను వేడుకుంది.
'మంత్రి మల్లారెడ్డితో ప్రాణహాని ఉంది... రక్షించండి' - Minister Malla reddy today news
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని... ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. ఆక్రమంగా తన భూమిని కబ్జా చేసేందుకు మంత్రి యత్నిస్తున్నారని కమిషన్కు ఫిర్యాదు చేసింది.
Woman complains at HRC against Minister Mallareddy
Last Updated : Feb 17, 2020, 9:29 PM IST