మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి భవాని కాలనీలో ఈ ఏడాది కొత్తగా మద్యం దుకాణం మంజూరైంది. మద్యం దుకాణం ఏర్పాటుకు సదురు వ్యాపారి గది అద్దె కోసం గాలించాడు. ఇంటి యజమానులు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో రెండు గదుల నిర్మిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు ఆందోళనకు దిగారు. అధికారులు చెప్పిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ఏర్పాటు చేయడంవల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. మద్యం దుకాణం ఏర్పాటు నిర్ణయం విరమించుకునే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.
మద్యం దుకాణం ఏర్పాటును నిరసిస్తూ మహిళల ఆందోళన - boduppal sai bhavani nagar people demand for wines shop remove today news
ప్రశాంతంగా ఉండే ఆ కాలనీలో మద్యం ఏర్పాటుకు సిద్ధం కావడం వల్ల మహిళలతోపాటు కాలనీవాసులు ఆందోళనకు దిగారు. ఇది ఎక్కడో కాదు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి భవాని కాలనీ.

Wins Shop Issue at boduppal
'మద్యం దుకాణం ఏర్పాటు నిర్ణయాన్ని విరుమించుకోవాలి'
TAGGED:
Wins Shop Issue at boduppal