పేకాట ఆడుతున్న ఓ కౌన్సిలర్ ను.. మేడ్చల్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుందనపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని దమ్మాయిగూడ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ తో పాటు మరో నలుగురిని పోలీస్ స్టేషన్ తరలించారు.
పేకాట ఆడుతూ పట్టబడ్డ కౌన్సిలర్ - దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ అరెస్టు
ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రజాప్రతినిధి.. పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ తోపాటు, మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

పేకాడుతూ పోలీసులకు చిక్కిన..దమ్మాయిగూడ కౌన్సిలర్
దీనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 86,250ల నగదు.. 7 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:దూరంగా బెంచీలు... సగంమందే విద్యార్థులు