ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన వీఆర్ఏ... ఆక్రమణదారులకు వరంగా మారాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ తండా ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న ఇళ్లను కూల్చాల్సింది పోయి వారి వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మండల పరిధిలో యాదగిరి వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఆక్రమణదారులకు వరంలా మారిన వీఆర్ఏ - VRA AUDIO VIRAL IN DUNDIGAL NEWS
మేడ్చల్ జిల్లా దుండిగల్ తండాలో ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న ఇళ్లను కూల్చాల్సింది పోయి... ఓ వీఆర్ఏ డబ్బులు డిమాండ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆక్రమణదారులకు వరంలా మారిన వీఆర్ఏ
దుండిగల్ తండాలో ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్నవారి ఇళ్లను కూల్చకుండా ఉండాలంటే... డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆడియో వైరల్ అయింది. వీఆర్ఏను తహసీల్దార్ భూపాల్ సస్పెండ్ చేశారు. అనంతరం అక్రమణలకు పాల్పడిన వారి ఇళ్లను అధికారులు కూల్చేశారు.
ఇదీ చూడండి:కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైంది: మాణిక్కం ఠాగూర్