మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్లలో 319 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆరు డివిజన్లలో 2,93,938మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంగళవారం ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మల్కాజిగిరి పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు - మల్కాజిగిరిలో పోలింగ్ 2020
బల్దియా ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మల్కాజిగిరి పరిధిలో మొత్తం 319 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Breaking News