కూకట్పల్లి వివేకానందనగర్ డివిజన్ తెదేపా అభ్యర్థి సామ్రాజ్యం పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలే తమకు విజయాన్ని అందిస్తాయని చెప్పారు. గత ఆరు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలే తమకు ఆయుధాలు: తెదేపా అభ్యర్థి - జీహెచ్ఎంసీ ఎన్నికల లేటెస్ట్ వార్తలు
తెరాస ప్రభుత్వ వైఫల్యాలే తమకు విజయాన్ని అందిస్తాయని వివేకానందనగర్ డివిజన్ తెదేపా అభ్యర్థి దండమూడి సామ్రాజ్యం అన్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
ప్రభుత్వ వైఫల్యాలే తమకు ఆయుధాలు: తెదేపా అభ్యర్థి
తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలోనే డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా సమస్యలు తాండవిస్తున్నాయని చెప్పారు. తనకు అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:గల్లీ పార్టీ కావాలా.. దిల్లీ పార్టీ కావాలా: కేటీఆర్