మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో రసాయనాలు రోడ్డుపైకి రావడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలు డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న కుంటలో కలుస్తున్నాయి. కుంట నిండటం వల్ల రసాయనాలు రహదారులపైకి చేరి వాహనాలు జారుతున్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు 15 మంది వాహనదారులు గాయపడ్డారు.
రహదారులపై రసాయనాలు.. జారిపడుతున్న వాహనదారులు - chemicals on jawahar nagar road
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న కుంటలో నుంచి రసాయనాలు రహదారిపైకి రావడం వల్ల వాహనాలు జారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి సుమారు 15 మంది వాహనదారులు గాయపడ్డారు.
రహదారులపై రసాయనాలు
వారం రోజులుగా డంపింగ్ యార్డు నుంచి వస్తోన్న రసాయనాలతో డెంటల్ కళాశాల నుంచి సీఆర్పీఎఫ్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : ప్రభుత్వ భూమి కనబడితే చాలు.. కబ్జా చేసేస్తారు!