ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో కరోనా టీకా పంపిణీ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సర్కిల్‌లో చకచకా కొనసాగుతోంది. సర్కారు ఆదేశాల మేరకు వాహకుల వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతగా సాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ జీహెచ్‌ఎంసీ రెండు విభాగాలు సమన్వయంతో పని చేస్తూ అర్హులందరికీ టీకాలు వేస్తున్నారు.
vaccination: ఉప్పల్ సర్కిల్‌లో 14 రోజుల్లో 16,822 మందికి టీకా - telangana news updates
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సర్కిల్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతగా సాగుతోంది. 14 రోజుల్లో 16,822 మందికి టీకా పంపిణీ చేశారు. ఉప్పల్ సర్కిల్‌లో టీకా పంపిణీ అర్హులైన వారు సుమారు 4లక్షల వరకు ఉంటారని అధికారులు అంచనా వేశారు.
వ్యాక్సినేషన్
14 రోజుల్లో 16,822 మందికి టీకా పంపిణీ విజయవంతంగా సాగింది. ఉప్పల్ సర్కిల్‌లో టీకా పంపిణీ అర్హులైన వారు సుమారు 4లక్షల వరకు ఉంటారని అధికారులు అంచనా వేశారు. వాహకులను ప్రభుత్వం వృత్తుల వారీగా గుర్తించింది. దాని ప్రకారమే ముందు రోజునే వారికి కూపన్ల పంపిణీని మున్సిపల్ విభాగం చేపడుతోంది. కిరాణ, చిరు, వీధి వ్యాపారుల నుంచి మటన్, చికెన్ వ్యాపారుల వరకు అందరికీ టీకా పంపిణీ చేస్తోంది.