రేవంత్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పీసీసీ పదవి వెనకబడిన వర్గం నుంచి బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలిపానని ఆయన పేర్కొన్నారు.
'రేవంత్‌రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది' - పోలీసులకు ఫిర్యాదు చేసిన వీహెచ్
మేడ్చల్ జిల్లా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపాడు.
'రేవంత్‌రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది'
రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వకూడదని పార్టీ హైకమాండ్‌కు తెలిపానని అన్నారు. దాంతో కొంతమంది రేవంత్ అనుచరులు తనకు ఫోన్ చేసి నీ అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు.
ఇదీ చూడండి :అభిమాని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో సోనూసూద్ సందడి