తెరాస ప్రభుత్వం అమలు చేస్తోన్న కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కొనియాడారు. ఉప్పల్, కాప్రా జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని 72 మంది లబ్ధిదారులకు గురువారం తన క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే అన్నారు. 'భేటీ బచావో- భేటీ పడావో' అనేది కేంద్రంలో భాజపా మాటలేనని విమర్శించారు. ఆచరణలో ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.