రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విచిత్రమైన పరిపాలన కొనసాగిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థులతో కలిసి మేడ్చల్ జిల్లాలోని పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్‌లో శనివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు.
సమస్యల గురించి వివరించడానికి కార్మికులు, మహిళలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వద్దకు వెళితే దర్శన భాగ్యం కూడా కల్పించడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎప్పుడు ఎక్కడుంటారో.. ఏం చేస్తారో.. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని విచిత్ర ముఖ్యమంత్రి ఉన్నందుకు బాధపడుతున్నామన్నారు.