మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో కాంగ్రెస్ పార్టీ(Congress party hyderabad news) ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపేయడం కలకలం రేపింది. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్న కాంగ్రెస్.. శ్రేణులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
శిక్షణ తరగతులకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు హాజరుకానున్నారు. జిల్లా, మండలస్థాయి అధ్యక్షులు సహా 12 వందల మంది రానున్నారు. వాళ్లకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు పెట్టారు.