తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడ్చల్ జిల్లాలో బాలిక, వివాహిత అదృశ్యం - మేడ్చల్ జిల్లా వార్తలు

మేడ్చల్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కె.మనుష, వివాహిత హైమావతి కనబడటం లేదు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఇద్దరి మిస్సింగ్​కు సంబంధించి వేర్వేరు కేసులు నమోదయ్యాయి.

Two womens missing in Medchal district
మేడ్చల్ జిల్లాలో ఇద్దరు మహిళలు అదృశ్యం

By

Published : Jul 6, 2020, 7:58 PM IST

బహుదూర్ పల్లి తాండాకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కె.మనుష(18) 5వ తేదీ రాత్రి నుండి కనబడటం లేదు. రాత్రి 11.50 నిమిషాల సమయంలో ఇంట్లో లేచి చూడగా తన చెల్లెలు కనబడలేదు, చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో అక్క శ్యామల దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది.

మల్లంపేట నివాసి హైమావతి(30) ఉదయం 6గంటల నుండి కనబడటం లేదు. భర్త వెంకట స్వామి తన భార్య కనపడటం లేదని దుండిగల్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

పైన పేర్కొన్న రెండు కేసులను మిస్సింగ్ కేసులుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండీ:అశ్రిత అనాథాశ్రమంలో చిన్నారుల అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details