గండిమైసమ్మకు చెందిన సరిత, కృష్ణ దంపతుల కుమార్తె విద్యార్థిని శిరీష ఎంబీఏ చదువుతుంది. మంగళవారం మధ్యాహ్నం పుస్తకాలు తెచ్చుకోవటానికి బయటకు వెళ్లింది. రెండు గంటలైన తిరిగి రాకపోవటం వల్ల కుటుంబసభ్యులు ఆమె ఫోన్కు చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. కంగారుపడిన కుటుంబసభ్యులు దుండిగల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వేర్వేరు చోట్ల ఇద్దరి అదృశ్యం - వేర్వేరు చోట్ల ఇద్దురు మహిళల అదృశ్యం
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు వారి కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటం వల్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![వేర్వేరు చోట్ల ఇద్దరి అదృశ్యం Two womens Missing at Dundigal in Medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7450931-966-7450931-1591119771523.jpg)
వేర్వేరు చోట్ల ఇద్దురు మహిళల అదృశ్యం
అదేవిధంగా గండిమైసమ్మకు చెందిన తిరుపతమ్మ, భర్త ఏసుబాబుతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఏసుబాబు నచ్చజెప్పి తిరుపతమ్మను ఇంటికి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి ఏసుబాబు భర్త షాపుకి వెళ్లొచ్చేసరికి భార్య ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కంగారు పడిన ఏసుబాబు దుండిగల్ పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Jun 3, 2020, 12:52 PM IST