తెలంగాణ

telangana

ETV Bharat / state

Road Accident: ఆగి ఉన్న డీసీఎంని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదాలు

ఆగి ఉన్న డీసీఎంను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషాదం బౌరంపేటలో జరిగింది.

two-teenagers-were-killed-in-a-road-accident
two-teenagers-were-killed-in-a-road-accident

By

Published : Sep 4, 2021, 10:13 AM IST

Updated : Sep 4, 2021, 11:18 AM IST

అర్ధరాత్రి.. ఆపై అతివేగం... నిర్లక్ష్యం... ఫలితం రెండు ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. వివరాల్లోకి వెళితే... మేడ్చల్ జిల్లా సూరారానికి చెంది ప్రమోద్​రెడ్డి(22), వరంగల్​కు చెందిన సునై రెడ్డి(22) ఇద్దరూ స్నేహితులు. కలిసి చదువుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో బాచుపల్లి నుంచి బౌరంపేట వైపు బైక్ వేసుకుని వెళుతున్నారు.

బౌరంపేట సమీపంలో ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలయ్యాయి. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని, దీనికితోడు అతివేగంగా వస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

ఇదీ చదవండి:

KCR meet Modi : మోదీకి సీఎం కేసీఆర్ అందించిన పది లేఖల్లో ఏముంది? ప్రధాని స్పందనేంటి?

Last Updated : Sep 4, 2021, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details