హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన అనిల్ అనే వ్యక్తి తన కారులో దుండిగల్ వైపు వెళ్తున్నాడు. ఐడీపీఎల్ సిగ్నల్ వద్దకు రాగానే ముందు సాయిగౌడ్ అనే వ్యక్తి కారు ఉండటం వల్ల అనిల్ సైరన్ కొట్టాడు.
మద్యం మత్తులో ఇద్దరు యువకుల గొడవ - Syran godava latest news
మద్యం మత్తులో సిగ్నల్ వద్ద వెనక కారులో ఉన్న వ్యక్తి సైరన్ మోగించడం వల్ల ఇద్దరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఐడీపీఎల్ సిగ్నల్ వద్ద చోటుచేసుకుంది.

మద్యం మత్తులో ఇద్దరు యువకులు గొడవ
మద్యం మత్తులో ఉన్న సాయిగౌడ్ విచక్షణ కోల్పోయి అనిల్‌పై దాడికి దిగాడు. దీనివల్ల ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాయిగౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో ఇద్దరు యువకులు గొడవ
ఇదీ చూడండి :అనిశాకు చిక్కిన మరో తిమింగలం.. కోటి 12 లక్షల అవినీతి