మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ హెచ్ఎంటీ జంగల్లో ఓ గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుండిగల్ పీఎస్ పరిధి బహదూర్‌పల్లి పాత మద్యం దుకాణం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్నిగుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.