తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదృశ్యం - ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదృశ్యం

అర్ధరాత్రి ఇద్దరు అక్కాచెల్లెళ్లు కనిపించకుండా పోయిన ఘటన మేడ్చల్​ జిల్లా దుండిగల్​ పరిధిలోని గండిమైసమ్మ ప్రాంతంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

two sisters missing in medchal district
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదృశ్యం

By

Published : Jun 30, 2020, 2:25 PM IST

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదృశ్యమైన ఘటన దుండిగల్ పరిధిలో గండిమైసమ్మ ప్రాంతంలో జరిగింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని గండిమైసమ్మలో నివాసముంటున్న అలీ, షబానా ఇద్దరు భార్యాభర్తలు వీరికి ఆరుగురు సంతానం కాగా.. అందరూ ఆడపిల్లలే. సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఎప్పటిలాగే కుటుంబసభ్యులందరూ నిద్రపోయారు.

అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తల్లి లేచి చూడగా.. తమ పెద్దకుతూరు యాస్మిన్ (17), రెండో కూతురు హర్షియా (16) కనబడకపోవడం వల్ల స్థానికంగా, బంధువులను ఆరా తీయగా ఆచూకీ లభించకపోవడంతో దుండిగల్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. గతంలో వీరు ఫోన్​లో మాట్లాడేవారని ఎంత అడిగినా చెప్పేవారు కాదని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: తమ్ముడి హత్య.. తల్లితో కలిసి అంత్యక్రియలకు ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details