రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం కొందరి డీలర్ల అవినీతి కారణంగా నల్ల బజారుకు తరలిపోతోంది. సుమారు 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఘట్‌కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
స్థానిక చౌదరిగూడ సమీపంలో రేషన్ బియ్యం లోడుతో ఓ లారీ నిలిపి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని లారీలో పరిశీలించగా.. అందులో సుమారు 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. నిందితులు మహమ్మద్ జమీరుద్దీన్, వసీం అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి:ఉత్తరప్రదేశ్లో బయటపడ్డ టన్నులకొద్దీ పసిడి!