కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ... ఇద్దరు మృతి - కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ
08:52 March 22
Lorry Accident
మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ పరిధి గోదావరి హోమ్స్‌లో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లడంతో... అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు ఇద్దరు కార్మికులు ఎప్పటిలానే నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున భవనం వద్దకు స్టీల్ లోడ్‌తో వచ్చిన లారీ.. వారిపై దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ కార్మికులను గమనించకుండా లారీని వెనక్కు నడిపడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
లారీ టైర్ల కింద చందన్ రామ్(23), చందన్ కుమార్ సహరి(23) నలిగి మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.