మేడ్చల్ జిల్లా మౌలాలీ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని, ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇళ్లలో చోరీలు.. ఇద్దరు నిందితుల అరెస్ట్... - ఇద్దరు వ్యక్తులు అరెస్టు
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి పలు ఇళ్లలో వేర్వేరుగా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఇళ్లలో చోరీలు.. ఇద్దరు నిందితుల అరెస్ట్...
స్థానిక ఎస్పీ నగర్లో ఓ ఇంట్లో విలువైన వస్తువులు చోరీ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రాత్రి అనుమానాస్పదంగా వీరిద్దరు కనిపించడంతో విచారించి నిందితురాలు జానకిని అరెస్ట్ చేశారు. మరో ఘటనలో అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలసరస్వాతి నగర్లోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కందుల శశి అనే నిందితుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇవీ చూడండి: కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి