తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇద్దరు బాలికలు అదృశ్యం - two girls missing

ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయిన ఘటన మేడ్చల్​ జిల్లా సూరారంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు బాలికలు అదృశ్యం

By

Published : Nov 15, 2019, 10:47 PM IST

మేడ్చల్​ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. సూరారం కృష్ణానగర్​లో నివాసముంటున్న రుబీనా (15), మనీషా (15) ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. ఉదయం 7 గంటలకు ఇంట్లో నుంచి ట్యూషన్​కు వెళ్లి... అక్కడి నుంచి బడికి వెళ్లారు. ఇద్దరూ సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడం వల్ల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి తోటి స్నేహితులను అడగగా 11 గంటల సమయంలో వెళ్లిపోయినట్లు తెలిపారు.

ఇలియాస్ (19), రమేశ్(22) అనే ఇద్దరు ఆటో డ్రైవర్లపై అనుమానం ఉండటంతో వారి ఇంట్లో వెతికారు. వారు కూడా లేకపోవడంతో పాటు వారి సెల్​ఫోన్లు కూడా స్విచ్ఛాప్​ వస్తుండటం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు బాలికలు అదృశ్యం

ఇవీ చూడండి: 'జాతిపిత పేరు దుర్వినియోగం చేస్తున్న మోసపూరిత సంస్థలు'

ABOUT THE AUTHOR

...view details