మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి విషయంలో ముగ్గురు స్నేహితులు కెల్విన్ రాజు, మహేందర్, మున్నా గొడవకు దిగారు. మిగిలిన ఇద్దరు.. మున్నాను కత్తితో పొడిచి.. అక్కడనుంచి పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన మున్నాను స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
గంజాయి కోసం స్నేహితుడిపై కత్తితో దాడి... - మేడ్చల్ నేరవార్తలు
గంజాయి విషయంలో ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ.. ఓ మిత్రుడి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
గంజాయి కోసం స్నేహితుడికే కత్తిపోట్లు..