తెలంగాణ

telangana

ETV Bharat / state

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు - గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు వార్తలు

అక్రమంగా విద్యార్థులకు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉప్పల్​ పోలీసులు అరెస్టు చేశారు.

Two arrested for transporting marijuana
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు

By

Published : Feb 3, 2020, 6:34 PM IST

కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉప్పల్​ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన విశాల్‌, యాదాద్రి జిల్లాకు చెందిన పవన్‌ అనే ఇద్దరు గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అరకు నుంచి గంజాయిని కొనుగోలు చేసి రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పలు ఇంజనీరింగ్‌ కశాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి పేర్కొన్నారు.

ఉప్పల్‌లోని సత్యనగర్‌లో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా విశాల్‌, పవన్‌లపై అనుమానంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. వారి నుంచి 7. 5 కిలోల గంజాయి, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు

ఇవీ చూడండి: కేటీఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలి: రేవంత్​ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details