ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మద్దతును ప్రకటించారు. జీడిమెట్ల బస్ డిపో నుంచి షాపూర్ నగర్ వరకు అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీలో కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ మొండి వైఖరిని వీడాలని సూచించారు. 50వేల కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ పేరుతో తొలగించడం అన్యాయమని అన్నారు. కోర్టు తీర్పునకు ముందే కేసీఆర్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
'సెల్ఫ్ డిస్మిస్ పేరుతో తొలగించడం అన్యాయం' - tsrtc strike at jeedimetla
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడాలని సూచించారు.
tsrtc strike