తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్​: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కారుదే హవా - MEDCHAL MALKAJIGIRI DISTRICT MUNCIPALITIES

మేడ్చల్‌ మల్కాజిగిరి​ జిల్లాలోని తొమ్మిది పురపాలికల్లో అధికార పార్టీ పట్టు సాధించింది. అన్ని పురపాలికలు కలిపి 173 వార్డులకు 111 స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది.

MEDCHAL MALKAJIGIRI DISTRICT MUNCIPALITIES
MEDCHAL MALKAJIGIRI DISTRICT MUNCIPALITIES

By

Published : Jan 25, 2020, 11:18 PM IST

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో తెరాస జెండా ఎగరవేసింది. మొత్తం 28 వార్డులున్న దుండిగల్‌లో 17 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన వాటిలో ఆరు కాంగ్రెస్, ఒకటి భాజపా గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డులను సొంతం చేసుకున్నారు.
అలాగే 23 వార్డులున్న మేడ్చల్‌లోనూ కారు పార్టీ గెలిచింది. 14 స్థానాల్లో తెరాస దూసుకుపోగా... కాంగ్రెస్, స్వతంత్రులు చెరో నాలుగు వార్డులతో సరిపెట్టుకున్నారు. భాజపా ఒక స్థానాన్ని సొంతం చేసుకుంది.

MEDCHAL MALKAJIGIRI DISTRICT MUNCIPALITIES
నాగారంలో 20 వార్డులకు తెరాస 14, కాంగ్రెస్ 3, భాజపా 1, స్వతంత్రులు 2 స్థానాలకు గెలుచుకున్నారు. పోచారంలో 17 వార్డులుండగా 12 తెరాస చేజిక్కించుకుంది. స్వతంత్రులు 3 స్థానాలను, కాంగ్రెస్, భాజపా చెరో స్థానంలో గెలిచారు. దమ్మాయిగూడ, ఘట్‌కేసర్, కొంపల్లిలోనూ ప్రజలు గులాబీ పార్టీనే అందలం ఎక్కించారు. 18 వార్డులున్న ఈ మూడు మున్సిపాలిటీల్లో 15, 10, 9 స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. దమ్మాయిగూడలో మిగిలిన 3 స్థానాలు కాంగ్రెస్ గెలవగా... ఘట్‌కేసర్‌లో కాంగ్రెస్, స్వతంత్రులు చెరో నాలుగు వార్డుల్లో విజయం సాధించారు. కొంపల్లిలో కాంగ్రెస్ 5 స్థానాలు, భాజపా 4 స్థానాలు గెలిచారు. ముకుంటలోనూ 16 వార్డుల్లో 9 స్థానాల్లో కారు జోరుగా దూసుకెళ్లింది. స్వతంత్రులు 5, కాంగ్రెస్ 2 స్థానాలతో సరిపెట్టుకున్నారు. గుండ్లపోచంపల్లిలో మొత్తం 15 వార్డులకుగానూ తెరాస 11 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. మిగిలిన నాలుగింటినీ కాంగ్రెస్, భాజపా చెరిసగం పంచుకున్నారు.
బస్తీమే సవాల్​: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కారుదే హవా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details