తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: మంత్రి మల్లారెడ్డి - మేడ్చల్‌ రహదారిపై తెరాస కార్యకర్తల ర్యాలీ

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. భారత్‌ బంద్‌లో భాగంగా మేడ్చల్‌ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

trs minister and activists protests at medchal nh 44 highway
వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి: మంత్రి మల్లారెడ్డి

By

Published : Dec 8, 2020, 12:12 PM IST

నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు భారత్ బంద్‌లో భాగంగా మేడ్చల్‌ బస్‌ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

అనంతరం శ్రేణులతో కలిసి ఆందోళనలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేడ్చల్ క్యాంప్ కార్యాలయం నుంచి డిపో వరకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండి:అన్నదాతలకు మద్దతుగా బంద్‌... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ABOUT THE AUTHOR

...view details