గత రెండు రోజుల క్రితం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కరోనా బారినపడ్డారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. మైనంపల్లి కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని తెరాస పార్టీ శ్రేణులు కోరారు.
ఎమ్మెల్యే మైనంపల్లి కరోనా నుంచి కోలుకోవాలని పూజలు - malkajgiri mla infected by corona
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తెరాస పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని దయతో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యలోకి తిరిగి రావాలని వేడుకున్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి కరోనా నుంచి కోలుకోవాలని తెరాస నాయకుల పూజలు
సంకట చతుర్దశి సందర్భంగా అల్వాల్ రామ్ నగర్ లోని శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో నిరంతరం తలమునకలై ఉండే మైనంపల్లి భగవంతుని కృపతో త్వరలోనే కోలుకుని ఆయురారోగ్యాలతో ప్రజల మధ్యలోకి రావాలని వారు ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: 'ఓల్డ్బోయిన్పల్లిని గోల్డ్బోయిన్పల్లిగా తీర్చిదిద్దటమే లక్ష్యం'