రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ఓటు వేయాలని మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లోని చింతల్లో ఏర్పాటు చేసిన ఎస్సీ సంఘం, పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. పాస్టర్లు అందరూ ఎంపీ అభ్యర్థికి మద్దతు పలికి.. దీవించారు.
అభివృద్ధి చూసి ఓటు వేయండి: రాజశేఖర్ రెడ్డి
కుత్బుల్లాపూర్‌లోని చింతల్లో ఎస్సీ సంఘం, పాస్టర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం గులాబీ బాస్ కృషి చేస్తున్నారని తెలిపారు.
మర్రి రాజశేఖర్ రెడ్డి