మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని 58వ వార్డు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. తెరాస అభ్యర్థి హస్తం నేతపై దాడి చేశారని ఆరోపించారు.
జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై తెరాస నేతల దాడి..! - జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై తెరాస నేతల దాడి
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58వ వార్డులో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. తెరాస అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి చేశారని ఆరోపించారు.
జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై తెరాస నేతల దాడి
కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి జరిగిందని తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ నాయకులే దాడికి పాల్పడటం చాలా దారుణమని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిని ఆయన ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : ఇరుకు గదులు... ఇక్కట్లు పడుతున్న ఓటర్లు